BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

సిద్దిపేటలో పశువుల దొంగల ముఠా అరెస్ట్..!

Select Suryaa Now
సిద్దిపేటలో పశువుల దొంగల ముఠా అరెస్ట్..!

సిద్దిపేటలో పశువుల దొంగల ముఠా అరెస్ట్

నలుగురు నిందితులు అరెస్ట్‌.. 20 మేకలు, గొర్రెలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

సీసీటీవీ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అభినందించిన సీపీ రష్మీ పెరుమాళ్

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :

సిద్దిపేట పరిసర ప్రాంతాలతో పాటు రాజగోపాలపేట పరిధిలో వరుసగా మేకలు, గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 మేకలు, 11 గొర్రెలు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దొంగతనాలు

చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన వరకొట్టు లింగం తనకు చెందిన ఆరు గొర్రెలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్మదగిన సమాచారం, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

పగలు రెక్కీ.. రాత్రి వేళల్లో చోరీలు

పోలీసుల విచారణలో మహమ్మద్ అబ్దుల్ రహమాన్ అలియాస్ ఎంసారపు శేఖర్, గొల్లెన రాజు, బొంతల రాజు, గండికోట వెంకటేష్ అనే నలుగురు కలిసి పశువుల దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. గ్రామాల శివార్లలోని మేకలు, గొర్రెల షెడ్లను లక్ష్యంగా చేసుకొని, పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో జీవాలను దొంగిలించేవారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన పశువులను కేశవపట్నం గ్రామంలోని ఓ షెడ్‌లో దాచేవారని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు.

రూ.2 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

నిందితుల నుంచి మొత్తం 20 జీవాలు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌ నిమిత్తం తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

పోలీసు బృందానికి సీపీ అభినందనలు

ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, చిన్నకోడూరు ఎస్‌ఐ చంద్రమోహన్, పోలీసు సిబ్బంది తిరుపతి, పరశురాములు, సీసీఎస్ సిబ్బంది యాదగిరి, జగదీష్‌లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ అభినందించారు.

 సూర్య న్యూస్: సిద్దిపేట అర్బన్, దేవులపల్లి భూపతి