10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం
సీతమ్మధార, సూర్య : సంబరాలు సమైక్యతను పెంపొందించేందుకు సాధనాలని నగర పోలీస్ కమిష నర్ శంఖభ్రత బాగ్చి పేర్కో న్నారు. సీతమ్మధార ఏ.పి. ఎస్.ఈ. బి. కాలనీ వెల్ఫేర్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో సోమవారం ఆయన పాల్గుని ప్రత్యే క పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “దైవ, దేశ భక్తితో జీవనాన్ని సాగించినట్లయితే జీవితంలో ఎన్నో సత్ఫలితాలను సాధించవచ్చని బాగ్చి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖ పట్నం నేడు దేశంలోనే ప్రధాన వేదికగా నిలుస్తున్నదని, ఇందుకు ప్రజలు ప్రోత్సాహాం, ఆదరణ కారణమన్నారు. అనంతరం. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కు చెందిన గోక డింపుల్, ఎన్. జోషిత, పి. శ్రావణి, దేవ హర్షిని, తరణ్య బృందం, కె సాత్విక,' ఎం. నిక్షిత, ఎస్. యామిని, నిత్య ఐశ్వర్య హాసినిల బృందం ' చేసిన బహుభాషా నృత్యాలు వేశేషంగా ఆకట్టు కున్నాయి నిర్వహక సంఘం సారదులు కొండ్రు రామారావు, సింహాద్రిరాజు, చలసాని సుజని, కె. సత్య రాజు, ఎన్. నాగేంద్ర కుమారిలు కళాకారులను, సంఘ సేవకులను ఘనంగా సత్కరించారు. వైస్ చైర్మన్ బి.గురునాధ రావు సంధాన కర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సిహెచ్.ఎస్.ఆర్.ఎల్. శాస్త్రి, ఎం. మహేశ్వరరావు, జ్యోతి రాణి , జి. మంజులరాణి , కొండ్రు ఉదయ, న్యాయవాది, గాయకులు రంగనాథ్, కొరియో గ్రాఫర్ ఆర్. నాగరాజ్ పట్నాయక్, ఆర్. హెచ్ టీన తది తరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇక్కడ అమ్మవారిని సుమారు పది లక్షలు రూపాయలతో అందంగా అలంకరించారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.