BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

అప్పుల భారం-ఎండిన వరి పంట!

Select Suryaa Now
అప్పుల భారం-ఎండిన వరి పంట!

*--రూ.80 వేల పెట్టుబడి బూడిదపాలు!* 

*--ఎండిన మూడు ఎకరాల పంట* 

*--పెట్టుబడి ఎలా తీర్చాలి? రైతుకు కన్నీటి కష్టాలు* 

నవాబుపేట సూర్య న్యూస్: పంట చేతికొస్తే అప్పులు తీరి కుటుంబానికి ఆసరాగా ఉంటుందని ఆశించిన ఆ రైతుకు నిరాశే మిగిలింది.ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట కళ్ల ముందే ఎండిపోవడంతో రైతు కాట్రావత్ జములమ్మ ఆవేదన చెందుతోంది.మండలంలోని పుట్టోనిపల్లి తాండ పరిధిలోని కొత్తకుంట తాండలో ఈ పరిస్థితి నెలకొంది.రైతు జములమ్మ దాదాపు రూ.80వేల అప్పు తెచ్చి మూడు ఎకరాల్లో వరి నాట్లు వేసింది.బోరులో పుష్కలంగా నీరు ఉండటంతో పంట దిగుబడిపై ఆశలు పెట్టుకుంది.అయితే ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోవడం,మరోవైపు విద్యుత్ కోతల కారణంగా పంటకు సకాలంలో నీరు అందలేదు.దీంతో మూడు ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయింది.ఒకవైపు చేతికందని పంట,మరోవైపు అప్పుల భారం.దీంతో అప్పులు ఎలా తీర్చాలి?కుటుంబాన్ని ఎలా పోషించాలి?అనే ఆందోళన రైతును వెంటాడుతోంది.విత్తనాలు,ఎరువులు,కూలీల ఖర్చులతో పాటు సాగు కోసం చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.పంటను కాపాడుకునేందుకు నీటి కోసం ఎదురుచూసినా పరిస్థితులు అనుకూలించకపోవడంతో తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.శ్రమించి పంట సాగు చేసినా ప్రకృతి పరిస్థితులు,విద్యుత్ కోతలతో నష్టపోవాల్సి రావడంపై రైతు ఆవేదన వ్యక్తం చేస్తోంది.అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించాలని,నష్టపోయిన రైతుకు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ప్రభుత్వం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతు ఆశగా ఎదురుచూస్తోంది.