పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవికి దాఖలైన 12 నామినేషన్లలో 7 ఆమోదం, 5 తిరస్కరణకు గురయ్యాయి. 36 వార్డులకు సంబంధించి 150 నామినేషన్లలో 104 ఆమోదం పొందగా, 34 తిరస్కరణకు గురయ్యాయి. మరో 12 నామినేషన్లపై పరిశీలన కొనసాగుతోంది.
రేపు నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.