BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నెల్లూరు కల్చరల్, రాపూరు మేజర్ న్యూస్   :  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదిలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజైన సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి, 10 గంటలకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిపించారు.సాయంత్రం ప్రత్యేక పుష్పాలంకరణ అనంతరం, 6 గంటలకు ఆదిలక్ష్మి అమ్మవారు 'ధనలక్ష్మి' అలంకారంలో పద్మపీఠంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు, అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ప్రాకారోత్సవం కన్నుల పండువగా సాగింది. తదుపరి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ఆలయ ఉపకమీషనరు, కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్థన్ రెడ్డి తెలిపారు. పెంచలకోన ఆలయ అభివృద్ధికి, అన్నదాన పథకానికి సోమవారం ఓ భక్తుడు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. మర్రిపాడు మండలం, భీమవరం గ్రామానికి చెందిన మూలి వెంకటేశ్వర రెడ్డి కుమారుడు మూలి మాధవ రెడ్డి.. ఆలయ నిత్యాన్నదాన పథకానికి రూ. 1,00,000, ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి మరో రూ. 1,00,000 నగదును విరాళంగా సమర్పించారు.