మహిషాసుర రూపంలో దుర్గామాత
ఆత్మకూరు/ సూర్య న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో కేశవ స్వామి నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఎదురుగా శ్రీ విరాట్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9వ రోజు మహిషాసుర విషయంలో అలంకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విరాట్ స్వర్ణకారుల సంఘం నాయకులు బంగారు భాస్కర్, శాంతా చారి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి.