జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు
వెంకటాచలం మేజర్ న్యూస్ : పూడిపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు టి. కరుణశ్రీ రూపొందించిన ప్రాజెక్టు ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా జాతీయ స్థాయికి ఎంపికైంది. ‘విద్యలో నవాచార పద్ధతులు, ప్రయోగాల ప్రోత్సాహం–2026–27’ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన 27 ప్రాజెక్టుల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఐదు ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నెల్లూరు జిల్లా నుంచి ఎంపికైన ఏకైక ప్రాజెక్టు కావడం విశేషం. కళల ద్వారా జీవశాస్త్ర బోధన, విద్యార్థుల అభ్యసన అంతరాలను అధిగమించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డేవిడ్ కరుణశ్రీని అభినందించారు.