BREAKING
శ్రీకాళహస్తి పట్టణం మున్సిపల్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ భయం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా: మండల ప్రజా ప్రతినిధులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన గూడూరు వెంకటేశ్వర్లు స్థూల విలువ జోడింపు (GVA) పెంపునకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* మూగజీవుల దాహం తీర్చేలా చర్యలు కూటమి ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం బలోపేతం టీడీపీ నేత ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ కె. పెదపూడి గ్రామంలో జోరు వానలో ఎన్నికల ప్రచారంలో రాయపురెడ్డి కూటమి నేతలు జోరు రైతులకు, వ్యాపారస్తులకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విస్తృత రుణ పథకాలు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ రద్దు చేయాలి తెలుగు సినిమాల్లో డ్రగ్స్, మద్యం దృశ్యాలపై నిఖిల్ సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు! తీర్థప్రసాదాలు స్వీకరించని జగన్మోహన్ రెడ్డికి రాముడి పేరు పలికే అర్హత లేదు – ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు నవంబర్ 30లోగా రైతులకు సవరించిన అడంగల్ కాపీలను రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఇంటి వద్దకే పంపిణీ* *మ్యుటేషన్ దరఖాస్తుల్లో ప్రస్తుత పోస్టల్ చిరునామాను సరిగ్గా, పూర్తిగా, తప్పనిసరిగా నమోదు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: ఎంసీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేష్ గ్రామపంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్‌ మరియు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

Select Suryaa Now
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
సూర్య కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయిలు విడుదల కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కోర్సులు పూర్తిచేసిన 6 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించి, బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిగుర్ల శ్రీనివాస్, గుంటి స్వరూప, నల్లగొని శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, అనుమస నితిన్, అంజాద్, కరుపాక మునక్క, రాజుల నవ్య, బొంతుల తిరుమల, రమేష్, అశ్విత్ తదితరులు పాల్గొన్నారు.