BREAKING
కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు

పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో శుభకార్యాల వేదిక.. కీసరలో కేజీఎఫ్ ఓపెన్ లాన్స్, ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Select Suryaa Now
పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో శుభకార్యాల వేదిక.. కీసరలో కేజీఎఫ్ ఓపెన్ లాన్స్, ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

మేజర్ న్యూస్, మేడ్చల్ జిల్లా ప్రతినిధి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కేజీఎఫ్ ఓపెన్ లాన్స్, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భూమిపూజ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకే అందుబాటులో ఉండేలా ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు.వివాహాలు, శుభకార్యాలు, ఇతర కుటుంబ వేడుకలను నిర్వహించుకునే సామాన్య ప్రజలకు ఈ వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అందుబాటు ధరల్లో సౌకర్యాలు కల్పించడం ద్వారా మధ్యతరగతి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందాడి శ్రీకాంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్: పన్నాల బాల్ రెడ్డి