BREAKING
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.. వారి కుటుంబాలకు అండగా నిలవడం అందరి బాధ్యత: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ *అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు సమాజంలో కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం: జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్* 21వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా కేశవ నాయుడుకు బీ ఫారం అందజేత.. చారిత్రాత్మక ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ పిలుపు రోడ్డు వేస్తా అంటేనే.. ఓటు అడగడానికి రావాలి..! ఎంపీటీసీ నామినేషన్లలో మీడియాపై ఉక్కుపాదం: పారదర్శకతపై నీలి నీడలు! కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ప్రేమకథా సినిమా.. ప్రశంసలు కురిపించిన ప్రముఖ నేత! యాచారంలో రూ.1.22 లక్షలకు దుర్గామాత కలశం కైవసం.. వేలంపాటలో మొత్తం రూ.4.52 లక్షల ఆదాయం ఇరువర్గాలు ఘర్షణ ద్విచక్ర వాహనాలు ధ్వంసం! కూతురి పేరు వెల్లడించిన దీపికా పదుకొనే దంపతులు.. రెండో సంతానానికి ఆ పేరు పెట్టిన స్టార్ కపుల్! పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనిది జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి..

పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..! అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..!  అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్

సిద్దిపేట అర్బన్, మేజర్ న్యూస్ :

దేశ రక్షణ, ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ అన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేసే విభాగమని, పండుగలు, సెలవులతో సంబంధం లేకుండా పోలీసులు 24 గంటలూ విధులు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను స్మరించుకోవడంతో పాటు, వారి కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను శాఖ ఎప్పటికీ విస్మరించదని సీపీ రష్మి పెరుమాళ్ హామీ ఇచ్చారు. అమరవీరుల కుటుంబ సభ్యులు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడి, వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను గౌరవించి జ్ఞాపికలను అందజేశారు.

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఏడుగురు పోలీసుల అమరత్వం

అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్ మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు విధి నిర్వహణలో ఏడుగురు పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన 154 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పేర్లను చదివి వినిపించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల సేవలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

పోలీసుల త్యాగస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజల భద్రత కోసం వారు చేసిన సేవలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సూర్య న్యూస్ : సిద్దిపేట అర్బన్,  - దేవులపల్లి భూపతి.