తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు
శామీర్‌పేట,మేజర్ న్యూస్:మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్‌లను అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్, మున్సిపల్ కౌన్సిలర్ ముద్దం సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏళ్ళ మల్లేష్, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, చాట్లపల్లి నర్సింగరావు, ముద్దం రాఘవరెడ్డి, బోయిని సాయికుమార్, కుడుముల వెంకటేష్, కొంగ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, ఉమ్మడి షామీర్పేట్, మేడ్చల్ జిల్లా.