కూటమి అభ్యర్థులకు అండగా పుర ప్రజలు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
వినుకొండ: మునిసిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 32, 33, 34 వార్డులలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. కూటమి బలపరిచిన చైర్మన్ అభ్యర్థి చెరుకుంపాలెం షమీం ఖాన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని చీఫ్ విప్ జీవీ ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు కూడా నిర్మించలేదని వ్యక్తం చేశారు.పట్టణ ప్రజల తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు రూ. 240 కోట్లతో చేపట్టిన శాశ్వత త్రాగునీటి పథకం త్వరలోనే పూర్తి చేసి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించ డమే లక్ష్యంగా పనిచేస్తున్నామ న్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..