BREAKING
నాగర్ కర్నూలు లో ఒంటి కాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి రేపటి నుంచి డిగ్రీ తుదివిడత ప్రవేశాలు అనుమతి లేనిదే బోరు వేస్తే చర్యలు తప్పవు : తహశీల్దార్ శ్రీనివాస్ గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు చెడుపై సాధించిన విజయమే విజయదశమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు - కలెక్టర్ రాజర్షి షా కోలాహలంగా నువ్వురుపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా ఖాజావలి నామినేషన్ క్రైస్ట్‌చర్చ్ టీ20: ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం - 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం : ఎమ్మెల్యే కన్నా మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క 34వ వార్డులో కీర్తి జావిద్ ముమ్మర ప్రచారం కాకినాడ జిజిహెచ్ లో గుండె వైద్యం గల్లంతు!

కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు

Select Suryaa Now
కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు

 

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో

 కాకినాడ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభాపతి శ్రీ యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం ఆయనకు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక కిమ్స్ ట్రస్ట్ (KIMS-Trust) ఆసుపత్రికి తరలించారు.

వెంటనే స్పందించిన వైద్య బృందం – స్టెంట్‌లో బ్లాక్ తొలగింపు: యనమల రామకృష్ణుడు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ఆసుపత్రి వైద్య బృందం అప్రమత్తమైంది. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ నిశాంత్, డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో ఆయనను ఎమర్జెన్సీగా క్యాథ్ ల్యాబ్ (Cath Lab)కు తరలించి యాంజియోగ్రామ్ నిర్వహించారు.

ఆరు నెలల క్రితం ఆయన హైదరాబాద్‌లో స్టెంట్స్ వేయించుకోగా, గతంలో వేసిన ఆ స్టెంట్‌లోనే రక్తం గడ్డకట్టి (బ్లడ్ క్లాట్), కాల్షియం పేరుకుపోయి రక్తప్రసరణకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు కార్డియాలజిస్టులు గుర్తించారు. వెంటనే వైద్యులు బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా ఆ అడ్డంకిని పూర్తిగా తొలగించి, స్టెంట్‌ను సరిచేసి రక్తప్రసరణను పునరుద్ధరించారు.

48 గంటల పాటు ఐసీయూలో అబ్జర్వేషన్: ప్రస్తుతం యనమల రామకృష్ణుడు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రి డాక్టర్ ఎస్.సి.హెచ్.ఎస్. రామకృష్ణ తెలిపారు. గురువారం ఆసుపత్రిలో పాత్రికేయులకు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేసి యనమల ఆరోగ్య పరిస్థితిని వివరించారు. గుండె సంబంధిత సమస్యతో పాటు ఆసుపత్రికి వచ్చే సమయానికి ఆయనకు 101 డిగ్రీల జ్వరం (వైరల్ ఫీవర్) కూడా ఉండటంతో, వైద్యులు దానికి కూడా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గుండె రక్తప్రసరణ, పంపింగ్, బీపీ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఆయనను 48 గంటల పాటు ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం సమగ్ర హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.

ఈ మొత్తం చికిత్సా ప్రక్రియను కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రి సీఈవో వంశీ, సీఓఓ డాక్టర్ రవి సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ దగ్గరుండి పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లను వేగవంతం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆరా – అండగా ఉంటామని భరోసా: యనమల రామకృష్ణుడు ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. మాజీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సమక్షంలో సీఎం చంద్రబాబు స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కిమ్స్ కార్డియాలజిస్ట్ బృందంతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పూర్తి వైద్య సదుపాయాలు సమకూర్చాలని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైద్యులకు సూచించారు. సీఎం స్పందనపై వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పలువురు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి చేరుకుని యనమల రామకృష్ణుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.