BREAKING
రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా! పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు - నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం - ఆయుష్మాన్ ఖురానా 'ఉడతా తీర్' మూవీ రివ్యూ: నవ్వులు పంచడంలో ఈ స్పై కామెడీ మెప్పించిందా? మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!

నాగర్ కర్నూలు లో ఒంటి కాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

Select Suryaa Now
నాగర్ కర్నూలు లో ఒంటి  కాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్‌లోని సమ్మె శిబిరంలో ఉద్యోగులు ఒంటి కాలిపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  ఎన్‌హెచ్‌ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డా. బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్యశాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్‌ వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఈహెచ్‌ఎస్‌ అమలు, మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు తమ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జేఏసీ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసులు, ట్రెజరర్‌ ప్రవీణ్, జేఏసీ ప్రతినిధులు డా. జగన్‌, డా. మహతి, డా. సాయి కంఠ, రజియా, సురేష్‌, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పి.వినయ్ కుమార్,  నాగర్‌కర్నూల్‌ క్రైమ్, సూర్య న్యూస్