BREAKING
అమెరికాలో హలోవీన్ వేడుకలు...భయానక ఉత్సాహంతో ప్రత్యేక ఏర్పాట్లు కళ్యాణదుర్గం ఎంపిడివో కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. నార్పల జనసేన ZPTC అభ్యర్థిగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ నామినేషన్ ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్లే కళ్లూ.. చెవులూ కళ్యాణదుర్గం ఎంపిటిఓ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలను పరిశీలించిన ఆర్టీవో వసంత బాబు. అమెరికాలో మీజిల్స్ వ్యాధి...భారీగా పెరిగిన కేసులు, సీడీసీ హెచ్చరిక సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ మండల నూతన కమిటీ ఎన్నిక ప్రజాస్వామ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో ఈ-శ్రమ, టెలీ లా శిబిరాలు నిర్వహించాలి భారత్-యూకే వాణిజ్యాంబరానికి గండి...స్కాచ్ విచారణపై ట్రేడ్ బాడీ ఆందోళన రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కేనా? పూనూరు టిడిపి ఎంపీటీసీ రెబల్ అభ్యర్థిగా సాయి కార్తీక్. ఉక్రెయిన్ డిజిటల్ మౌలిక సదుపాయాలపై రష్యా ముప్పేట దాడి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ హర్షవర్ధన్ రాణె, సాదియా ఖతీబ్ లవ్ స్టోరీ 'సితా' విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి ఎప్పుడంటే?

అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు

Select Suryaa Now
అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు
సూర్య, హుజురాబాద్:హుజురాబాద్ డివిజన్ పరిధిలో అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడపరాదని, అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హుజురాబాద్ డిప్యూటి డిఎం హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ రోడ్డులో గల ప్రియాంక క్లినిక్ లో ఆకస్మికంగా సందర్శించి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రైవేట్ క్లినిక్ నిర్వహకుడు కుమార్ మండల్ ను పలు ప్రశ్నలు అడిగారు.  ఆయుర్వేద ఆసుపత్రి నడపాలంటే తప్పనిసరిగా సర్టిఫికెట్ ఉండాలని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనుమతి లేని సర్టిఫికెట్ తో ఇక్కడ వైద్యం చేయరాదని అన్నారు. అర్హత, అనుమతి లేకుండా ఆసుపత్రి నడపడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని ఆయన అన్నారు. ఆకర్షణీయమైన ఆసుపత్రి బోర్డులను తొలగించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకులు తప్పనిసరిగా డిఆర్ఏ చట్టప్రకారము రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ కాలం పూర్తయిన వారు తిరిగి రెన్యువల్ చేయించుకోవాలని, లేని పక్షంలో ఆసుపత్రులు జరిమానాతో పాటు సీజ్ చేయబడునని చెప్పారు. కొత్తగా ప్రైవేట్ క్లినిక్ లు నడిపేవారు తప్పనిసరిగా డాక్టర్ల అర్హత పత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాలు, పారా మెడికల్ స్టాఫ్, తెలంగాణ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన వారు మాత్రమే అర్హులని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డిఆర్ఏ అనుమతి తీసుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు పాటించాలని ఆయన తెలిపారు. తప్పనిసరిగా జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు బయో వేస్ట్ మేనేజ్ మెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసు నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాలని అన్నారు.  ఆసుపత్రి మూసి వేయాలని, తెరిచినట్లు మరోసారి ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ తనిఖీలో జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.