రేపు వికారాబాద్‌కు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.. ఆర్‌ఓబీ నిర్మాణ పనుల పరిశీలన
వికారాబాద్, మేజర్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం (అక్టోబర్ 24) వికారాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో హైదరాబాద్‌కు వెళ్లే రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులను ఆయన పరిశీలించనున్నారు.పర్యటనలో భాగంగా ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ నుంచి వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వికారాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారిపై నిర్మిస్తున్న ఆర్‌ఓబీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్), వికారాబాద్ నుంచి పర్యటన వివరాలు వెల్లడించారు.