మిసెస్ యూనిటీ వరల్డ్ ఆశా దీపిక అట్టలూరికి ఘన స్వాగతం
హిమాయత్‌నగర్ , మేజర్ న్యూస్: మిసెస్ యూనిటీ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఆశా దీపిక అట్టలూరి విజయోత్సవంగా హైదరాబాద్‌లో ప్రత్యేక రథయాత్ర నిర్వహించారు. చార్మినార్ నమూనాతో, ఎర్రటి కిరీటంతో రూపొందించిన రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నాయకురాలిగా, పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఆమె 'బియాండ్ బౌండరీస్' కార్యక్రమం ద్వారా భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లో సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.