శాలివాహన వన సమారాధన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
(డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా)
కోనసీమ కుమ్మరి శాలివాహన సేవా సంక్షేమ సంఘం సమావేశం మాచవరం శాలివాహన సంఘ భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఈ ఏడాది వన సమారాధన కార్యక్రమాన్ని నవంబర్ 22 ఆదివారం అయినవిల్లి గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపం పక్కన నిర్వహించాలని పెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు.సంఘ ఐక్యత, అభివృద్ధికి ఈ వన సమారాధన వేదిక కావాలని, అన్ని ప్రాంతాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని శాలివాహన సంఘం పెద్దలు,నాయకులు పిలుపునిచ్చారు.