రక్షణ వ్యవస్థ బాధ్యతై రాణించాలి..
-ప్రజలకు అభయం ఇవ్వాలి..
-డిప్యూటీ సీఎం బట్టి కీలక వ్యాఖ్యలు
-భయం వీడి ప్రజలకు చేరువ కావాలి
-టీజీ ఎస్ పి ఎస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం హితోపదేశం
అమీన్ పూర్,మేజర్ న్యూస్
అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలో టీజీఎస్పీఎస్ బెటాలియన్లు 36వ రైజింగ్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోలీస్ దలాల నుంచి ఆకట్టుకునే గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భరోసాని కల్పించాలి, పోలీసు వ్యవస్థ ప్రజల్లో భయాన్ని కాదు రక్షణగా ఉన్నామని కొండంత భరోసాన్ని కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్కు నిజమైన అర్థం చెప్పేలా ప్రవర్తించాలని సూచించారు.
శాంతి భద్రతలే ప్రాధాన్యం, రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని అభివృద్ధి వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు.
అందులో టి జి ఎస్ పి ఎస్ దళాల పాత్ర కీలకమైనదని కొనియాడారు.
క్రమశిక్షణ అంకిత భావం, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎస్పీఎస్ దళాలు ప్రదర్శించే ధైర్య సాహసాలు క్రమశిక్షణ అభినందనీయమని కొనియడారు.సిబ్బంది సంక్షేమం, పోలీస్ సిబ్బంది వారి కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రజాస్వామ్య హక్కుల రక్షణ, శాంతిభద్రతుల పరిరక్షణలో భాగంగా చట్టపరిదిలోనే పనిచేస్తూ సామాన్య ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, బలగాలపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో టి జి ఎస్ పి ఎస్ డి జి స్వాతి లక్రా, పలువురు పోలీస్ఉన్నతాధికారులు పాల్గొన్నారు.