BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

చోరీ కేసులో వంద కు పైగా దొంగతనాలకు పాల్పడిన పాత నిందితుడికి ఏడాది జైలు.... @ రూ.100 జరిమానా విధించిన న్యాయస్థానం.

Select Suryaa Now
చోరీ కేసులో  వంద కు పైగా దొంగతనాలకు పాల్పడిన పాత నిందితుడికి ఏడాది జైలు....  @ రూ.100 జరిమానా విధించిన న్యాయస్థానం.

   హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టు:  చోరీ కేసులో వందకు పైగా దొంగతనాలకు పాల్పడిన కరుడుకట్టిన పాత నేరస్థుడు చిన్న ఎల్లయ్య ను దోషిగా నిర్ధారిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.  మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 125/2026 కేసులో ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడు వై. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న ఎల్లయ్య (లేట్ పి. రత్నయ్య కుమారుడు)పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 331(4), 305(ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు నాంపల్లిలోని XIV అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సీసీ నంబర్ 3704/2026గా విచారణకు వచ్చింది.
విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి జస్టిస్ వి. సౌమ్య, ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. జరిమానా చెల్లించని పక్షంలో నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు.
ఈ కేసులో మధురానగర్ పోలీస్‌స్టేషన్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ దర్యాప్తు నిర్వహించగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్. శ్రీలత ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కోర్టు డ్యూటీ అధికారులు జె. విక్కీ కుమార్, ఎం. వంశీ సహకరించారు. మధురానగర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ హెచ్. ప్రభాకర్ కోర్టు సిబ్బందిని అభినందించారు.