మల్కాజ్గిరి ని. వర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ఉప -ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేసిన ఎమ్. ఎల్. ఏ., మర్రి.
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : మల్కాజ్గిరి నియోజక వర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనుల పరిష్కరించేందుకు మల్కాజ్గిరి శాసన సభ్యులు మర్రి రాజ శేఖర్ రెడ్డి, రాస్ట్ర ప్రజాభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ను మర్యాదపూర్వకంగా కలిసి,వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కిరణ్ చిల్డ్రన్స్ హోమ్స్‌కు ఆర్థిక సహాయం అందించే అంశాన్ని వివరించడంతో పాటు, టీ-ఫ్రైడ్ ద్వారా అర్హులైన వారికి సబ్సిడీలు మంజూరు చేయాలని కోరడం జరిగింది.
అదేవిధంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం, నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి అంశాలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.యాదమ్మనగర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న బల్క్ మీటర్ల సమస్యను పరిష్కరించడం, సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా కల్పించడం, అలాగే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించడం జరిగింది.
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన విద్యుత్ సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, ఆశా కిరణ్ చిల్డ్రన్స్ హోమ్స్‌కు ఆర్థిక సహాయం, అర్హులకు సబ్సిడీల మంజూరు వంటి అంశాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా అందజేసిన వినతిపత్రంలోని అంశాలను పరిశీలించి, సంబంధిత సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సానుకూలంగా స్పందించడం జరిగిందని. ఎమ్. ఎల్. ఏ., తెలిపారు.