అద్దంకిలో జోరుగా తెదేపా ఎన్నికల ప్రచారం.
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అద్దంకి మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి కాకాని అశోక్, 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రంగిశెట్టి సాంబశివరావు (లహరి) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులోని ప్రతి గడపకూ తిరుగుతూ, స్థానిక ప్రజలను, దుకాణాదారులను కలుస్తూ వారితో మమేకమయ్యారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జోరుగా తిరుగుతూ సందడి చేశారు.