కూటమి గెలుపు కోసం దామచర్ల ప్రచార పర్వం
ఆరు డివిజన్లలో మేయర్, కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున ప్రచారం
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు శనివారం నగరంలోని ఆరు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. కూటమి పార్టీల మేయర్ అభ్యర్థి శిల్పతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 8 గంటలకు 6వ డివిజన్ గోపాల్‌నగర్‌లోని తిరుపతమ్మ దేవస్థానం వద్ద నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు 7వ డివిజన్ గోపాల్‌నగర్ 1వ లైన్ వద్ద, ఉదయం 10 గంటలకు 8వ డివిజన్ గోపాల్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు 24వ డివిజన్ వెంగముకలపాలెంలో, రాత్రి 7.30 గంటలకు 23వ డివిజన్ చెరువుకొమ్ముపాలెంలో, రాత్రి 8.30 గంటలకు 22వ డివిజన్ చెరువుకొమ్ముపాలెంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో దామచర్ల జనార్దన్‌రావు పాల్గొంటారు. ఈ సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి శిల్పతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరనున్నారు.