ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసిందని ఆర్ఐఓ డి.గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 15వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. పరీక్షలలో భాగంగా విద్యార్థులకు అందించనున్న ఆన్సర్ బుక్లెట్లలో మార్పు చేయడం జరిగిందని, బయాలజీ పరీక్షకు 40 పేజీల బుక్లెట్, మిగిలిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్ను అందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఓకేషనల్ కోర్సులకు సంబంధించి 24 పేజీల ఆన్సర్ బుక్లెట్ను విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. పరీక్షల షెడ్యూల్కు సంబంధించి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలకు సమాచారాన్ని ఇప్పటికే చేరవేశామని పేర్కొన్నారు.