ప్రత్తిపాడు : తలెత్తుకు నిలబడ్డ పారిశుధ్య వాహనం
అసలే అరకొరగా పారిశుధ్య సిబ్బంది పనితీరు,అదేమంటే సిబ్బంది లేరంటూ దాటవేసే మాటలు,ఇదే ప్రత్తిపాడు పారిశుధ్య వ్యవస్థ పనితీరుగా మారిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రోజుల తరబడి డ్రైనేజీలో పేరుకుపోతున్న చెత్త,మురుగు వాసన,దోమలతో సహవాసం చేయడం నిరంతరం పరిపాటిగా మారింది.మధ్యలో నన్ను కూడా గుర్తించండి అంటూ ఒకటో వార్డులో తలెత్తుకు నిలబడ్డ పారిశుధ్య వాహనం దర్శనమిచ్చింది.రోడ్డున పడ్డ చెత్త,దుర్వాసన,దోమలతో ఇక్కట్లు పడుతున్నా పారిశుధ్య సిబ్బంది పనితీరు మారడంలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.