BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్

Select Suryaa Now
నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి  మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా రహీమ్ ఖాద్రి మసీదు (ఖబ్రస్తాన్), నూరానీ మసీదుల సమీపంలో మైనార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచి, నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నా, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించాలన్నా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం అవసరమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో అనంతపురం నగర మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి, 37వ సచివాలయ అధ్యక్షుడు షేక్ జావిద్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కేఎండీ నకీబ్ ఉల్ రెహ్మాన్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు షేక్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.