మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల సెలెక్షన్స్ నిర్వహించి,ఎంపిక చేసినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన 11(ఎ) ఎయిర్ స్క్వాడ్రన్ (టి) ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ ఆర్.జె.అత్రే యూనివర్సిటీని సందర్శించి,ఇంటర్వ్యూ మరియు విద్యాప్రతిభ ఆధారంగా ఎంపికలు నిర్వహించారు.ఈ ఎంపికల్లో మొత్తం 50 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా మొత్తం 15 మంది విద్యార్థులు ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌లో చేరేందుకు ఎంపికయ్యారు.ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ ఆర్.జె.అత్రే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణ,అంకితభావం,జట్టు స్ఫూర్తి,నాయకత్వ లక్షణాలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఎంతో ముఖ్యమన్నారు.విద్యార్థులు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు దేశ సేవాభావాన్ని అలవర్చుకోవాలని,భారత సాయుధ దళాలు,రక్షణ రంగాల్లోని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.తమిళనాడులోని తాంబరం,ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో నిర్వహించిన ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంప్ (ఎఐవీఎస్ సి)-2026లో పాల్గొని ప్రతిభ కనబరిచిన మిట్స్ ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలు,దేశభక్తిని పెంపొందించడంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.నూతనంగా ఎంపికైన క్యాడెట్లను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి,ప్రో-ఛాన్సల్లర్ ఎన్ ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,అధ్యాపకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ వారెంట్ ఆఫీసర్ మనోహర్,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.కమల్ బాషా,ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ కేర్‌టేకర్ అధికారి డాక్టర్ చరణ్ కుచి,క్యాడెట్ విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి