స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్
తిరుపతి, మేజర్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు,నేటి చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి తొక్కుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నరసింహ యాదవ్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుండి భక్తులు ఎంతోమంది తిరుపతికి వస్తుంటారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా,భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అప్పుడు నందమూరి తారక రామారావు,ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని పేర్కొన్నారు.తిరుపతిలో మొత్తం 66 కార్పొరేషన్ డివిజన్లో ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థ ఎన్నికలలో టిడిపి 39 , జనసేన పార్టీ 22 కార్పోరేట్ స్థానాలకు, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలకు,, ఎన్డీఏ కూటమి మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాసును ఎన్నిక చేసిందని,మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా వీరందరిని తిరుపతి ప్రజలు ఆశీర్వదించి,అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని తిరుపతి ప్రజలను కోరారు. తిరుపతి అభివృద్ధిలో భాగంగా 106 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామన్నారు.గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,యువగళ్ళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ, తిరుపతిలో కంపెనీలతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు 13 వేల కోట్లు నిధులు కేంద్రం నుంచి రాబోతున్నాయని,ఏ విధంగానైనా అభివృద్ధిని, నిధులను అడ్డుకోవడమే లక్ష్యంగా చేసుకొని అడ్డుకునే కుట్ర వైసిపి చేస్తున్నదని ఆరోపించారు. స్థానిక సమస్త ఎన్నికలను వాయిదా వేసే విధంగా వైసీపీ కుట్రలకు పాల్పడుతున్నదన్నారు. తిరుపతి ప్రజలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని తిరుపతి ప్రజలకు నరసింహ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
Cell no :9705347341
H. Dwaraka, staff reporter.