కే గంగవరం ఎంపీపీ రేస్ లో అభ్యర్థులు వీరే
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండల పరిషత్ పరిధిలో 18 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఎంపీపీ పదవిని టీడీపీ, వైకాపా, జనసేన పార్టీ అభ్యర్థులు ఆశిస్తున్నారు. దంగేరు గ్రామం నుండి వైకాపా తరపున పోటీ చేస్తున్న రావిపాటి సత్యకృష్ణ, శివల ఎంపీటీసీగా పోటీ చేస్తున్న చుండ్రు సూర్యకుమారి, కుడుపూరు నుండి పోటీ చేస్తున్న రావుపాటి వెంకట గణేష్ చౌదరి, జనసేన నుండి సత్తి శ్రీకృష్ణనారాయణ తమ నామినేషన్లు దాఖలు చేసి పార్టీ అగ్ర నాయకులను ముఖ్య కార్యకర్తలు పార్టీ ఇన్చార్జిలవద్దకు తీసుకెళ్లి మద్దతు కోరుతున్నారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అభ్యర్థి ఎంపీపీ దక్కించుకుంటారు. 18 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 92 నామినేషన్లు వచ్చాయి. ఎండిఓ కార్యాలయానికి నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ నామినేషన్ పరిశీలన కార్యక్రమానికి రావాలని ఎన్నికల అధికారి పి.శ్రీనివాస్, ఎండిఓ ఎన్.శ్రీనివాస్ పేర్కొన్నారు. కే.గంగవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద పామర్రు ఎస్సై జి సోమేంద్ర తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 144 సెక్షన్ విధించామని గుంపులుగా ఎవరు తిరగరాదని ఎస్సై విజ్ఞప్తి చేశారు.