వాసవి అమ్మవారి ఊరేగింపు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం(డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా)అంబాజీపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి ఊరేగింపు భక్తి శ్రద్ధలతో, కన్నుల పండుగగా సాగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ ఉత్సవంలో అమ్మవారిని రకరకాల పూలదండలతో అద్భుతమైన అలంకరణ భక్తుల హృదయాలను ఆకట్టుకుంది.శుక్రవారం అంబాజీపేట సెంటర్ మీదుగా సాగిన ఊరేగింపులో గరగ నృత్య ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా అంబాజీపేట ఎస్ఐ ఎస్ కె.సుభానీ ఆద్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.