మీ ఓటుతో ఆశీర్వదించండి.. టిడిపి 21 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్
వార్డు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాయపు రాజశేఖర్ ఓటర్లను అభ్యర్థించారు. శుక్రవారం వార్డు పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంటింటా పర్యటిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపించాలని.. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రజలకు వివరించడం జరుగుతుందని.. కౌన్సిలర్ గా గెలుపొందితే అభివృద్ధితోపాటు వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.