హడావిడి పనులే కొంపముంచేయ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపర్యటన కోసం వేసిన రోడ్డు నెల తిరక్కుండానే కుంగిపోయింది.డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని ప్రధాన జగ్గనతోట రహదారి నాణ్యతా లోపంతో పూర్తిగా దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వేళ అధికారులు హడావుడిగా చేపట్టిన పనుల్లో నాణ్యత గాలికొదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.రోడ్డు మార్జిన్లలో గ్రావెల్ నింపకుండా, కనీస పటిష్టత లేకుండా తూతూమంత్రంగా పనులు ముగించడంతో ఇప్పుడు రోడ్డు అంచులు పెచ్చులూడి కాలువలోకి జారిపోతున్నాయి.
*ప్రమాదపు అంచున ప్రయాణం*
రహదారి పక్కన భారీ గొయ్యి తలపిస్తోంది. రోజూ వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఎదురెదురుగా వాహనాలు వస్తే తప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. పక్కకు జరిగితే నేరుగా కాలువలో పడే పరిస్థితి ఉండటంతో, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు.వీఐపీల పర్యటనలప్పుడే హడావుడి చేసే అధికారులు, ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం వీడాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి కుంగిన గట్టును పునర్నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు విన్నవిస్తున్నారు..