సామాజిక సేవలతోనే గుర్తింపు..-ఎస్సై తోట తిరుపతి
సామాజిక సేవలతోనే గుర్తింపు..
-ఎస్సై తోట తిరుపతి
బెజ్జంకి/మేజర్ న్యూస్:
సామాజిక సేవలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎస్సై తోట తిరుపతి పేర్కొన్నారు.మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో శుక్రవారం బాలవికాస ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్సై తోట తిరుపతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.అనంతరం వృద్ధులకు నిత్యావసర సరుకులు,దుస్తులు పంపిణీ చేశారు.సర్పంచ్ గాజ రవళి,ట్రస్ట్ ప్రతినిధులు అన్నమేరి,సుజాత తదితరులు పాల్గొన్నారు.(సూర్య రిపోర్టర్ భాస్కర్,బెజ్జంకి)