మల్లా పూర్, నాచారం లోని వి ఎన్ ఆర్ గార్డెన్ లో దేశ రక్షణ ధర్మ రక్షణ యాగం కు అంకురార్పణ
ముషీరాబాద్ మేజర్ న్యూస్ మల్లా పూర్, నాచారం లోని వి ఎన్ ఆర్ గార్డెన్ లో 23 శుక్రవారం నుండి మూడు రోజుల పాటు జరగ బోయే దేశ రక్షణ ధర్మ రక్షణ యాగం కు అంకురార్పణ జరిగింది. హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపక అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ యాగం లో యాగ కర్తలు గా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యు రాలు గీతా మూర్తి దంపతులు వ్యవహరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్ చందర్ రావు ఈశుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితులు చేబియ్యం రాఘవ శర్మ, నరేష్ శర్మ లు మొదట గణపతి పూజ, నృసింహ హోమం, నమక, చమకo, శ్రీ సూక్తం, పురుష సూక్తం గావిం చి యాగం చేయించ డం లో సహకరించారు. దేశం సుభిక్షం గా ఉండాలని , ఇంత వరకూ దేశాన్ని రక్షిస్తు ఉన్న రాజకీయ నాయకుల ఆయుషు దీర్ఘకాలంగా ఉండాలని, ఈ యాగ దీక్ష అని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మాశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆశీస్సుల తో యాగం మొదలు పెట్టామని నిర్వాహకులు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ పేర్కొన్నారు. సంస్థ సభ్యులు వాణి, భారతి, ఇంద్ర గంటి శర్మ, వందలాది మహిళలు, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర పతి బిరుదు గ్రహీత బ్రహ్మా శ్రీ రంగి సత్యనారాయణ శాస్త్రి ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అటు పిమ్మట అన్న ప్రసాద వితరణ జరిగింది.-