BREAKING
ఇయర్‌బడ్స్‌ పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఈ తీవ్రమైన ఆరోగ్య ముప్పు తప్పదు! అభివృద్ధిని చూసి ఓటు వేయండి - మంత్రి పార్థసారథి మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు

పట్టభద్రుల ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం - ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి

Select Suryaa Now
పట్టభద్రుల ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం  - ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలక ఎన్నికలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (ఎమ్ జీ ఆర్ ) అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఫిల్మ్ నగర్ డివిజన్ పరిధిలోని ఎమ్ ఆర్ సీ  కాలనీ, బీ జే ఆర్  నగర్‌లో పట్టభద్రులకు దరఖాస్తు ఫారాలను ఎమ్ జీ ఆర్  పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్ జీ ఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ మూడేళ్ల పాలనపై పట్టభద్రులు తమ తీర్పు ఇచ్చే సమయం ఆసన్నమైందని, రాబోయే పట్టభద్రుల ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ పరీక్షగా నిలవనున్నాయని పేర్కొన్నారు. విద్యావంతులు, నిరుద్యోగ యువత, మేధావులు తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుని ప్రజా సమస్యలపై స్పందించాలని పిలుపునిచ్చారు. 

ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసిందని ఆరోపించారు. పట్టభద్రులంతా ఓటరు నమోదును పూర్తి చేసుకుని ప్రజల పక్షాన నిలిచే అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్ జీ ఆర్  కోరారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి రాజకీయ సమాధానం లభించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వెంకీ ముదిరాజ్, సైదులు,జ్యోతి స్వరూప్, తేజ, నవీన్, తరుణ్, సంతు, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.