పర్యావరణ పరి రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ, పాదయాత్ర సన్నాహాక సమావేశం. ఈటల పాదయాత్ర.
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : జవహర్ నగర్ లో పర్యావరణ పరి రక్షణ కోసం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా వాటిల్లిన డపింగ్ యార్డ్ ఉత్పత్తి చేస్తున్న మీతేన్ కాలుష్య కోరలనుండి నిరుపేద ప్రజానీకాన్ని కాపాడేందుకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఉద్యమ కార్యాచరణకు ముందస్తు సన్నాహాక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
ప్రశ్నించే గొంతుక అని రేవంత్.రెడ్డికి ఓటు వేసి ఎంపీగా గెలిపిస్తే.. దానిని మెట్టుగా వాడుకున్నారే తప్ప ఈ ప్రాంతం వైపు తొంగి చూడలేదు.ప్రపంచంలో మీథేన్ కాలుష్యం ఉత్పతి చేస్తున్న కేంద్రాల్లో 4 వ స్థానంలో ఉంది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్.
ఈ చెత్త నిర్వహణ సరిగా చేయకుంటే ఆ ప్రాంతమే కాదు.. హైదరాబాద్ నగరానికి ముంపు పొంచి ఉందన్నారు.
ఈ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ ఈటల రాజేందర్ ఎంపీ పాదయాత్ర మొదలు పెడుతున్నానని డంపింగ్ యార్డు ను తరలించ్చేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అందుకు ఈ రోజు సన్నాహక సమావేశం జరిగుతుందని తెలిపారు.
25 న రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని,27 నుండి పాదయాత్ర మొదలవుతుందని పేర్కున్నారు.
సమస్య పై ఉపేక్షిస్తే బరిగీసి కోట్లాడతాం...
ఈ సమస్య కొలిక్కి వచ్చే వరకు వదిలేది లేదంటున్నారు. ఈ పోరాటం లో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఈ సమస్య పట్ల ప్రజలకు మీడియా, పత్రికలు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న.
ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కడు బీదరికంలో ఉన్న వారని,
కీసర, ఘట్కేసర్, దమ్మాయి గూడలో ఇంకా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు.
రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు.. కానీ అర్ధం మీరు చూపిస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా బూటకం.ఈ లిచర్డ్ నీళ్ల వల్ల చెరువుల్లో చేపలు చచ్చిపోతున్నాయి.
మహిళలకు గర్భ స్రావం జరుగుతుంది అని చెప్తుంటే దుఃఖం వస్తుంది. 12 మిలియన్ టన్నుల మీథేన్ గ్యాస్ విడుదల అవుతుంది.
12 లక్షల కార్లు విడుదల చేసే కాలుష్యం కంటే ఎక్కువ కాలుష్యం వస్తుందని,
కార్బన్ డై ఆక్సైడ్ కంటే 80 రెట్లు ఎక్కువ కాలుష్య.
దీనివల్ల హైదరాబాద్ నగర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఈ విషయం గురించి నేను పార్లమెంట్లో మాట్లాడిన. కేంద్ర మంత్రి కట్టర్ ని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ తో రండి అన్నారు.
నా పుట్టుకనే పోరాటం, రాజీపడేది లేదని అన్నారు.
కేసీఆర్ కి ఓటు వేస్తారని బి. ఆర్. ఎస్. బ్రమపడుతుందని,
ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తున్న బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. హైడ్రా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి పేదల గూడు లేకుండా చేశారు. ఇళ్ల సామాన్లు డోజర్లతో తొక్కించారు. బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు.
మేము చేసిన పోరాటం వల్లనే ఆ హైడ్రా ఆగడాలు ఆగాయి. ఇంకా ఆగాలి.
మూసీలో కొబ్బరినీళ్ల లాంటి నీళ్లు పారిస్తే మాకేం అభ్యంతరం లేదు.. అందుకోసం అటు ఇటు ఇళ్లను కూలగొట్టవద్దు అని అక్కడ పడుకొని ఇల్లు కూలగొట్టకుండా ఆపగలిగినం.
22 ఏ తెచ్చి పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు బీజేపీ అసెంబ్లీ బయట లోపలా పోరాటం చేసింది.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 30 కిలోమీటర్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గర్భస్రావాలు, క్యాన్సర్లు , అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వచ్చి చచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న వారు పేదవారు కాబట్టి ఇక్కడే ఉంటున్నారు.
ప్రభుత్వాలు పని చేయాల్సింది ఇలాంటి పెదవారికోసమే అని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని సూచించారు
రాంకీ అయోధ్య రెడ్డి ఇక్కడ వచ్చిన సి. ఎస్. ఆర్. డబ్బు ఆంధ్రా ప్రాంతానికి ఖర్చు పెడుతున్నారు అంటే సిగ్గుతో తలదించుకోవాలి.
ఈ డంప్ యార్డు కోసం భేషజాలు పక్కన పెట్టీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన... ఇక్కడ దుఃఖం తెలిసిన వాడివి కాబట్టి నీదగ్గరికి వచ్చాం అని చెప్పిన.. అయినా ఎలాంటి ప్రయోజనం లేకాపోయిందని వాపోయారు.
సియోల్ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఐఏఎస్ నరహరి దీనికి మంచి పరిష్కారం కనుగొన్నారు. వాటిని ఇక్కడ వాడండని అన్నారు.
వైబ్రంట్ హైదరాబాద్ బ్రాండ్ ను పోగొట్టకండి. చెత్తకు శాశ్వత పరిష్కారం అందించండి.
వాసన లేకుండా, లీచర్డ్ వాటర్ లేకుండా చేసే టెక్నాలజీ ఎక్కడ ఉన్నా తీసుకురండి. డబ్బుల కోసం ఆలోచన చేయకండి.
మీకు చేతకాకపోతే చెప్పండి కేంద్ర ప్రభుత్వంతో చేయిస్తాము. మేము కేంద్ర మంత్రులను కలిసి 2 లక్షల ఇళ్లను తీసుకువచ్చాం.
ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇస్తుంది.
నేను ప్రజల సేవకున్ని అని మోడీ చెప్తారు తప్ప, మేము ఇచ్చాం అని ఎప్పుడూ చెప్పరు.
తెలంగాణ కోసం రాష్ట్రమంతా పోరాట బొడ్రాయి అయ్యింది. అలాంటి చరిత్ర కలిగిందీప్రాంతం తెలంగాణ.. అక్కడి నుండి వచ్చిన వాడిని నేను. బీజేపీ మొత్తం ఈ ఉద్యమానికి అండగా ఉంటుంది అని అధ్యక్షుడు రామచందర్ రావు హామీ ఇచ్చారు.
మా ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కలిసి వస్తామన్నారు.
ఐక్య పోరాటం చేస్తాం.
జవహర్ నగర్ లో సకల జనుల సమ్మె చేస్తాం.ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ :
రాహుల్ గాంధీకి ఇక్కడి పరిస్థితి కనిపించడం లేదా.
రేవంత్ రెడ్డికి చెప్పడం లేదా ? అని ప్రశ్నించారు.
ఈ సమస్య పరిష్కారం కోసం ఈటల రాజేందర్ తో పాటు మేము కూడా పాదయాత్రలో పాల్గొంటాము అన్నారు.
బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్ మల్లారెడ్డి , ఎస్. టి.మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ కాంటెస్టెడ్ యంఎల్ ఏ సుదర్శన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గండే, యం బి సి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ రూరల్ మేడ్చల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సామా రంగా రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ చంద్ర రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ కే శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, తిర్మల్ రెడ్డి, తీరపతి యాదవ్, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేవేందర్, జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, శామీర్పేట్ మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ బాబు, జవహర్ నగర్ మాజీ ఎంపిటీసి రషీదా బేగం, కాంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ ఆనంద్,అధిక సంఖ్య లో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.