జెడ్ పి టి సి కోసం కూటమిలో కుమ్ములాట
అయినవిల్లి మేజర్ న్యూస్ :అయినవిల్లి మండలం జడ్పిటిసి టికెట్ కోసం ఆసక్తి నెలకొంది అయినవిల్లి మండల జెడ్పిటిసి టిక్కెట్టు జనరల్ మహిళలకు కేటాయించారు ఈ రేసులో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వర రావు కోడలు నాగ సత్య మంగాదేవి శుక్రవారం నామినేషన్ వేశారు జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షులు పోలిశెట్టి రాజేష్ సతీమణి మౌనిక శుక్రవారం నామినేషన్ వేశారు దీంతో కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన జనసేన తెలుగుదేశం వర్గాల మధ్య అయినవిల్లి మండలం జడ్పీటీసీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది అయితే వీరిద్దరి మధ్యలో ఎవరికీ బీఫామ్ సర్టిఫికెట్ అవుతది అనే విషయం ఆసక్తిగా మారింది రెండు పార్టీలు తరపున ఇరువురి అభ్యర్థిలు తమ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ ఆశాభావంతో ఉన్నారు ఇరు వర్గాలు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కులాల కుమ్ములాట తగ్గింది