BREAKING
ఆసియన్ పారా గేమ్స్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో అద్భుత రికార్డు పట్టభద్రుల ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం - ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి మీ ఓటుతో ఆశీర్వదించండి.. టిడిపి 21 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ వాసవి అమ్మవారి ఊరేగింపు మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం: శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపిన బావోజు సిద్దేశ్వర చారి! జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాల్సిందే మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రత్తిపాడు : తలెత్తుకు నిలబడ్డ పారిశుధ్య వాహనం కే గంగవరం ఎంపీపీ రేస్ లో అభ్యర్థులు వీరే బషీరాబాద్ కాంగ్రెస్‌లో రాజకీయ కదలికలు.. ఎమ్మెల్సీ, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణరావుతో భేటీ హెరిటేజ్ ఫుడ్స్‌లో లివో యోగర్ట్ వ్యాపార విలీనం విలువ ఆధారిత పాల ఉత్పత్తుల విస్తరణకు కీలక అడుగు టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి బీజేపీ వినతిపత్రం 30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి సమీర్ ఖాన్ ఇంటింటా ప్రచారం ముదిరాజ్ లను బీసీ(ఏ ) లో చేర్చవద్దు .. త్రివిధ దళాల సమన్వయంలో సీడీఎస్ కీలక పాత్ర 2047 నాటికి ఆధునిక రక్షణ వ్యవస్థే లక్ష్యం: నితిన్ ఎ. గోఖలే

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై కలెక్టర్ పర్యవేక్షణ

ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి. రాజబాబు శుక్రవారం పర్యవేక్షించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి వెబ్‌కాస్టింగ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో మాట్లాడిన కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జె. పంగులూరు, లింగసముద్రం తదితర మండలాల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులను అనుమతించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల పరిధిలో అమలులో ఉన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ పి. రాజబాబు సూచించారు.