జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాల్సిందే మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తలపెట్టిన పాదయాత్ర పై శుక్రవారం దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేఎల్పీ నాయకులు, నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చెత్త నిర్వహణ సరిగా చేయకుంటే ఆ ప్రాంతమే కాదు.. హైదరాబాద్ నగరానికి ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్య కొలిక్కి వచ్చే వరకు వదిలేది లేదంటున్న ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.ఉపేక్షిస్తే బరిగీసి కోట్లాడతాం అని హెచ్చరించారు. ప్రజలందరూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.
" ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కడు బీదరికంలో ఉన్న వారు. కీసర, ఘట్కేసర్, దమ్మాయి గూడలో ఇంకా వ్యవసాయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నారు.. కానీ అర్ధం మీరు చూపిస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బూటకం- ఈ లిచర్డ్ నీళ్ల వల్ల చెరువుల్లో చేపలు చచ్చిపోతున్నాయి.- మహిళలకు గర్భ స్రావం జరుగుతుంది అని చెప్తుంటే దుఃఖం వస్తుంది.
-12 మిలియన్ టన్నుల మీథేన్ గ్యాస్ విడుదల అవుతుంది.12 లక్షల కార్లు విడుదల చేసే పొల్యూషన్ కంటే ఎక్కువ కాలుష్యం వస్తుంది. - కార్బన్ డై ఆక్సైడ్ కంటే 80 రెట్లు ఎక్కువ కాలుష్య- దీనివల్ల హైదరాబాద్ నగర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి.- ఈ విషయం గురించి నేను పార్లమెంట్లో మాట్లాడిన. కేంద్ర మంత్రి కట్టర్ గారిని కలిస్తే రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ తో రండి అన్నారు. - నా పుట్టుకనే పోరాటం కోసం.. రాజీపడేది లేదు. -ప్రశ్నించే గొంతుక అని రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే.. దానిని మెట్టుగా వాడుకున్నారే తప్ప ఈ ప్రాంతం వైపు తొంగి చూడలేదు. -కేసీఆర్ కి ఓటు వేస్తారని బీ ఆర్ ఎస్ బ్రమపడుతుంది. -ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తున్న బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. హైడ్రా తీసుకువచ్చి రేవంత్ రెడ్డి పేదల గూడు లేకుండా చేశారు. ఇళ్ల సామాన్లు డోజర్లతో తొక్కించారు. బ్లాక్ మెయిలింగ్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు.- మేము చేసిన పోరాటం వల్లనే ఆ హైడ్రా ఆగడాలు ఆగాయి. ఇంకా ఆగాలి. మూసీలో కొబ్బరినీళ్ల లాంటి నీళ్లు పారిస్తే మాకేం అభ్యంతరం లేదు.. అందుకోసం అటు ఇటు ఇళ్లను కూలగొట్టవద్దు అని అక్కడ పడుకొని ఇల్లు కూలగొట్టకుండా ఆపగలిగినం. 22 ఏ తెచ్చి పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు బీజేపీ అసెంబ్లీ బయట లోపలా పోరాటం చేసింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 30 కిలోమీటర్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గర్భస్రావాలు, క్యాన్సర్లు , అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వచ్చి చచ్చిపోతున్నారు. అయినా ఇక్కడ ఉన్న వారు పేదవారు కాబట్టి ఇక్కడే ఉంటున్నారు. ప్రభుత్వాలు పని చేయాల్సింది ఇలాంటి పెదవారికోసమే అని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు కదా .." అని అన్నారు. ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎస్ మల్లారెడ్డి , ఎస్ టి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ కాంటెస్టెడ్ యంఎల్ ఏ సుదర్శన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గండే, యం బి సి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ రూరల్ మేడ్చల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు సామా రంగా రెడ్డి, మాజీ మునిసిపల్ ఛైర్మెన్ చంద్ర రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ కే శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, తిర్మల్ రెడ్డి, తీరపతి యాదవ్,బీజేపీ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యాలయం కార్యదర్శి గాలి సంపత్ యాదవ్, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేవేందర్, జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, శామీర్పేట్ మాజీ ఎంపీపీ శేఖర్ యాదవ్, జవహర్ నగర్ మాజీ కార్పొరేటర్ బాబు, జవహర్ నగర్ మాజీ ఎంపిటీసి రషీదా బేగం, కాంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ ఆనంద్,అధిక సంఖ్య లో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.