టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు
*టీడీపీకి షాక్.. వైసీపీలోకి జొన్నాడ
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకొత్తపేట నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో నల్లమిల్లి ప్రసాద్ రెడ్డి (పండు) — తెలుగుదేశం నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, వీరి గోవిందు — జొన్నాడ మాజీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు, మండా గీతాకృష్ణ రెడ్డి ఉన్నారు. వీరికి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.టీడీపీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరడం కొత్తపేట నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చేరికతో జొన్నాడ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన నాయకులకు చిర్ల జగ్గిరెడ్డి గారు స్వాగతం పలికారు. రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.