BREAKING
అభివృద్ధిని చూసి ఓటు వేయండి - మంత్రి పార్థసారథి మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ : జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి

హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి బీజేపీ వినతిపత్రం

Select Suryaa Now
హైదరాబాద్‌లో తాగునీటి సమస్యలపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి బీజేపీ వినతిపత్రం

జూబ్లిహిల్స్, మేజర్ న్యూస్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న కలుషిత నీటి సరఫరా మరియు తాగునీటి ఎద్దడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు జలమండలి  అధికారులకు వినతిపత్రం సమర్పించారు.  హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు   లంకల దీపక్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండి   కె. అశోక్ రెడ్డి  ని కలసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని  అందజేశారు. ప్రముఖ నేతల భాగస్వామ్యం- ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎన్. గౌతమ్ రావ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే   చింతల రాంచంద్రారెడ్డి, గోషామహల్ మాజీ ఎమ్మెల్యే   ప్రేమ్‌సింగ్ రాథోడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు   ఆనంద్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు  ప్రేమ్‌కుమార్,  వెంకటస్వామి,  అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమస్యల తక్షణ పరిష్కారానికి డిమాండ్ ; నగరంలో అనేక డివిజన్లలో మంచి నీటి పైప్‌లైన్లలోకి మురుగునీరు చేరుతుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోగాల బారిన పడుతున్నారని బీజేపీ నేతలు జలమండలి ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. కలుషిత నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో తక్షణమే లీకేజీలను అరికట్టాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్పందించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి  సమస్యలపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.