30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి సమీర్ ఖాన్ ఇంటింటా ప్రచారం
కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపుతో 30 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని... సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డులోని ఓటర్లకు సమీర్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కౌన్సిలర్ అభ్యర్థి సమీర్ ఖాన్ 30వార్డు పరిధిలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి గడపకు వెళ్లి కరపత్రాన్ని అందిస్తూ... సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించాలని, అలాగే టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి సమీర్ ఖాన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆశీస్సులతో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను యువకుడినని వార్డు ప్రజల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వార్డు రూప రేఖలు మార్చడానికి కృషి చేస్తానన్నారు. తాను కౌన్సిలర్గా గెలుపొం దితే 30 వార్డు ను మున్సిపాలిటీలోనే ఆదర్శవంతంగా అభివృద్ధిలో తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కటిక ఖాదర్ బాషా, అంజాద్ ఖాన్, ఎంఎన్ ఫయాజ్, నజీర్ ఖాన్ , అల్లా బకాష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.