మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
మంత్రాలయం,సూర్య ప్రతినిధి : కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్టోబర్ నెలకు సంబంధించి 22 రోజుల హుండీ లెక్కింపు శుక్రవారం పూర్తయింది. మొత్తం రూ.3,46,53,864 ఆదాయం సమకూరింది. ఇందులో కరెన్సీ రూ.3,36,41,364, నాణేలు రూ.10,12,500 ఉన్నాయి. అదనంగా 42 గ్రాముల బంగారం, 645 గ్రాముల వెండి లభించినట్లు మఠం మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు.
నల్లారెడ్డి సూర్య ప్రతినిధి మంత్రాలయం.. కర్నూలు జిల్లా