BREAKING
కడియం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా పుణ్యవతి నామినేషన్ కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు! మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్.. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్యామలాదేవికి ముస్లిం పెద్దల మద్దతు.. నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.? నేను సౌత్ ఇండియన్‌నే అంటున్న రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ ఆసక్తికర వ్యాఖ్యలు! పూల అలంకరణతో శోభిల్లిన వాసవి మాత.. భక్తి పారవశ్యంలో.. అంబాజీపేట రజినీకాంత్, కమల్ హాసన్ క్రేజీ మల్టీస్టారర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న భారీ ప్రాజెక్ట్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవానా! పెరిగిన ధరలు.. పడిపోయిన అమ్మకాలు పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి స్టార్‌డమ్ వస్తుంది పోతుంది కానీ దయ శాశ్వతం.. లెజెండరీ సింగర్‌ను కలిసిన అనుపమ్ ఖేర్! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు 32 నామినేషన్ దాఖలు. 20 ఎంపీటీసీ స్థానాలకు 81 నామినేషన్లు. పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులకు దూరం వారంలో ఒకరోజు డ్రై డే పాటించండి . సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం

Select Suryaa Now
జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో తాజా వార్తలను ప్రజలకు వేగంగా అందించాలనే లక్ష్యంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు, మాజీ జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జి ప్రారంభించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన యోగా మాస్టర్ తగరం శ్రీనివాసరావు ఈ న్యూస్‌ యాప్‌, టీవీని స్థాపించారు. ప్రముఖ టీవీ నటుడు నాని న్యూస్‌ యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు, పొల్నాటి బాబ్జి మాట్లాడుతూ, వేగవంతమైన వార్తా ప్రసారానికి పేరుగాంచిన వే2న్యూస్‌ తరహాలో ఎక్స్‌ప్రెస్‌ 24 కూడా క్షణాల్లో తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ఆకాంక్షించారు. వాస్తవాలను వెలికితీస్తూ, ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సమాజానికి ఉపయోగపడే వార్తలను అందించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఎక్స్‌ప్రెస్‌ 24 అధినేత తగరం శ్రీనివాసరావు, న్యూస్‌ యాంకర్‌ నాని, జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు కుక్కల మాధవరావు, డా. దాసరి శేషు, న్యూస్‌ ఛానల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.