BREAKING
మెదడు పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన పండు అవకాడో.. ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! జనరంజకమైన పాలన జగనన్నతోనే సాధ్యం : 30వ వార్డు వైకాపా అభ్యర్థిని నగీనా స్పష్టం ఆరోగ్య సమస్యలపై అమితాబ్ బచ్చన్ తాజా అప్‌డేట్.. మరింత విశ్రాంతి అవసరమంటూ పోస్ట్! ప్రజారవాణా వ్యవస్థను ప్రైవేటుపరం చేయవద్దు చీరాలలో టీడీపీకి భారీ బలం.. ఒకేసారి 150 కుటుంబాల చేరిక! ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా మాస్ బర్త్‌డే విషెస్.. స్పిరిట్ సెట్ పిక్ వైరల్! స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే... టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ మిట్స్ యూనివర్సిటీలో ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ క్యాడెట్ల ఎంపికలు : వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ వెల్లడి నగర అభివృద్ధికి వైఎస్సార్‌సీపీని గెలిపించండి మైనార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించిన మేయర్ అభ్యర్థి సి. రమేష్ బాలయ్య సినిమాతో యంగ్ హీరో బాక్సాఫీస్ క్లాష్.. క్రిస్మస్ రేసులో కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధమవ్వాలి జిల్లాస్థాయి అథ్లెటిక్ ఎంపిక పోటీలు మదనపల్లె జడ్పీటీసీ బరిలో రాటకొండ రెడ్డెమ్మ : తెలుగుదేశం తరపున నామినేషన్ దాఖలు నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలకు సన్నాహాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యాచరణ : జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి రామ్ చరణ్ - సుకుమార్ మూవీ హీరోయిన్ ఫిక్స్.. కియారా నుంచి ఆ యంగ్ బ్యూటీ వరకు!

ముదిరాజ్ లను బీసీ(ఏ ) లో చేర్చవద్దు ..

Select Suryaa Now
ముదిరాజ్ లను బీసీ(ఏ ) లో చేర్చవద్దు ..

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :బీసీ-డీలో ఉన్న ముదిరాజ్ లను బీసీ-ఏ గ్రూపులో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎ. భాగయ్య, రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ-ఏ గ్రూపులోని కులాల ప్రతినిధులతో కలిసి వారు మాట్లాడుతూ, బీసీ-ఏలో ఉన్న 57 కులాలు యాచక, సేవా వృత్తులపై ఆధారపడుతూ జీవనం సాగుతున్నారని… జనాభా, రాజకీయ ప్రాబల్యం ఉన్న ముదిరాజ్ లను ఇందులో కలిపితే తమ పిల్లల భవిష్యత్తు అందకారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

గతంలో అనంతరామన్ కమిషన్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాతే బీసీ-ఏ గ్రూపును ఏర్పాటు చేసిందని, ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీల కోసం శాస్త్రయత లేకుండా జీవోలు ఇవ్వడం సరికాదని అన్నారు. ముదిరాజ్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని, లేదా బీసీ-ఈ గ్రూపులో చేర్చాలని సూచించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న తమ ఎస్టీ వర్గీకరణ డిమాండ్ ను పరిష్కరించిన తర్వాతే ఇతర కులాల మార్పులు, చేర్పులను చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ముదిరాజ్ కులాన్ని బీసీ-ఏ గ్రూపులో చేర్చాలనే ప్రయత్నాన్ని విరమించుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ-ఏ కులాల నేతలు టి.నారాయణ, కంటే రాంచందర్, అంబటి సుధాకర్, డాక్టర్ మురళీమోహన్, అడ్వకేట్ శాంతప్ప, గుడబోయిన శివరత్నం, రాస్కాస్ భగవాన్, చుక్కల రామస్వామి, గరిగబోయిన మల్లేష్, ఏరువా బాలయ్య తదితరులు పాల్గొన్నారు.