BREAKING
అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే! పర్యావరణ పరి రక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ, పాదయాత్ర సన్నాహాక సమావేశం. ఈటల పాదయాత్ర. ఆదర్శ కుటుంబం మూవీ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న భావోద్వేగాల ప్రయాణం మతపరమైన పర్యాటకంలో సరికొత్త ఒరవడి ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యటనలతో ఎన్ ఆర్ ట్రావెల్‌బడీజ్

కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే

Select Suryaa Now
కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంశ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉందని రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆరేటి ప్రకాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారని ఆరేటి ప్రకాష్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవాల కోసం అరాచకాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాంటి కుట్రలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, ప్రజల అభిప్రాయమే ఎన్నికల్లో కీలకం కావాలని స్పష్టం చేశారు.

కాపు సామాజిక వర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆరేటి ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి గంధం పల్లం  రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు చిక్కాల గణేష్, కొమ్ముల సురేష్, మహమ్మద్ ఇర్ఫాన్, కొరసాల సురేష్ నాయుడు, చింతలపూడి సత్తిబాబు, చిక్కల ముద్దు బాబు, తిక్కి రెడ్డి వాసు, యిండి గల ఆనంద్, బావిశెట్టి నాగబాబు తదితరు పాల్గొన్నారు.             రంబాల నాగసత్య నారాయణ అమలాపురం