నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆర్ డి ఓ
ఎంపిటిసి స్థానాలకు 55నామినేషన్లు
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండలపరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ కేంద్రాన్ని కనిగిరి ఆర్ డి ఓ టి.అజయ్ కుమార్ సందర్శించి నామినేషన్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా మండలంలోని ఎంపిటిసి స్థానాలకు చివరిరోజు శుక్రవారం 19నామినేషన్లు వేయగా మొత్తం 55 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని సిఎస్ పురం ఒకటవ స్థానానికి 5,సిఎస్ పురం రెండవ స్థానానికి 5,చెన్నపునాయునిపల్లె 9,రేగులచెలక 2, డిజిపేట 3, బోయమడుగుల 8,ఉప్పలపాడు 6, నల్లమడుగుల 2, కోవిలంపాడు 3, పెదరాజుపాలెం 2, రెడ్డిగారికొత్తపల్లె 3,పెదగోగులపల్లె 5, అరివేముల 2 కలిపి మొత్తం 13ఎంపిటిసి స్థానాలకు 55నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఈసందర్భంగా మండలంలోని చెన్నపునాయునిపల్లె ఎంపిటిసి స్థానానికి జనసేన తరపున సమ్మన తిరపతయ్య నామినేషన్ వేశారు.