మంత్రి శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం: శాలువాతో సత్కరించి దసరా శుభాకాంక్షలు తెలిపిన బావోజు సిద్దేశ్వర చారి!
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మీర్‌పేట్ జీహెచ్‌ఎంసీ సోషల్ మీడియా కన్వీనర్, ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును శాలువాతో ఘనంగా సత్కరించి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించారు.