విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
హాలియా మేజా న్యూస్.
హాలియా పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది,
ఈ సందర్భంగా హాలియా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవరావు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి, పోలీస్ శాఖ విధులు, పోలీస్ స్టేషన్ పనితీరు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సమాజ రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలను విద్యార్థులకు తెలియజేశారు,
విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, క్రమశిక్షణతో మెలగాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సీఐ సూచించారు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని తెలిపారు,
ఈ కార్యక్రమంలో హాలియా ఎస్‌ఐ సాయి ప్రశాంత్ పాల్గొని, విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, చట్టాల ప్రాముఖ్యత మరియు ప్రజల భద్రతలో పోలీసుల పాత్రపై అవగాహన కల్పించారు.