పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాణా ప్రతాప్ రెడ్డి
కందుకూరు, మేజర్ న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై శనివారం సమావేశం నిర్వహించనున్నట్లు కందుకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.
కందుకూరు మండల కేంద్రంలోని సీతారామ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ చైర్మన్లు, సభ్యులు, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, బీఎల్‌ఏలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. ఓటరు నమోదు ప్రక్రియపై తమ సూచనలు, సలహాలు అందించి సమావేశాన్ని విజయవంతం చేయాలని రాణా ప్రతాప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
టి శ్రీనివాస్, మేజర్ న్యూస్.